Thursday, December 12, 2024

AP – భారత మారిటైమ్ గేట్ వే గా ఏపీ

వెలగపూడి – 2024-29 ఏపీ మారిటైమ్ విడుదల చేసింది ప్రభుత్వం.. మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఅండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ రాష్ట్రంలో పోర్టు అధారిత అభివృద్ది, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ ఇతర మారిటైమ్ సేవలు అందించేలా నూతన విధానం రూపొందించింది ప్రభుత్వం. ఏపీ మారిటైమ్ విజన్ ను ఆవిష్కరించడంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానం తయారు చేసింది ప్రభుత్వం.

సుదీర్ఘమైన తీర ప్రాంతం.. వ్యూహాత్మకంగా అనువైన ప్రాంతాన్ని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్దికి వినియోగించేలా విధాన రూపకల్పన చేశారు. 2030 నాటికి భారత మారిటైమ్ గేట్ వే గా ఏపీని మార్చేందుకు వీలుగా కార్యచరణ రూపొందించారు.

- Advertisement -

ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు కల్పించేలా విధానాన్ని తయారు చేసింది ప్రభుత్వం. కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాలను పెంపొందించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement