చింతూరు, , (ఆంధ్రప్రభ): మావోయిస్టు జిల్లా నాయకుడిని చింతూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కి చెందిన చందన మిశ్రా అలియాస్ నగేష్ 2018 సంవత్సరానికి ముందు మావోయిస్ట్ పార్టీకి ఆకర్షితుడై మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయి మావోయిస్ట్ కార్యకలపాల్లో చురుకుగా పనిచేస్తూ అంచెలెంచలగా ఎదుగుతూ జిల్లా నాయకుడుగా ఎదిగాడు. ఈ క్రమంలోనే 2018 వ సంవత్సరంలోనే ఇతనిపై చింతూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయి అప్పటీ పోలీసులు మిశ్రాను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. జైళుకి వెళ్ళి వచ్చిన తరువాత మిశ్రా తన తీరు మార్చుకోకుండా మళ్ళీ మావోయిస్ట్ పార్టీలోనే కొనసాగుతూ మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో 2024 వ సంవత్సరంలో చింతూరు పోలీస్‌స్టేషన్, ఏడుగుర్రాలపల్లి అవుట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లంపేట గ్రామ శివారు అటవీప్రాంతంలో మావోయిస్ట్ దళ సభ్యులు సోడి బామన్, నాగేశ్వరరావులతో కలసి మందు అమర్చిన కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఈ క్రమంలో మావోయిస్ట్ నాయకుడు మిశ్రాపై పోలీసులు నిఘా పెట్టారు ఇదే తరుణంలో చింతూరులో సంచరిస్తుండుగా సమాచారం అందుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించినట్లు చింతూరు ఎస్సై పేరూరి రమేష్ తెలిపారు.
ఏపీ, చత్తీష్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యలో జిల్లా కమిటీ- కార్యదర్శికి సహాయకుడిగా పని చేస్తున్నాడు. మావోయిస్టు పార్టీ అగ్రనేతల పక్కన ఉంటూ ఉద్యమాన్ని పెంచేందుకు పీపుల్స్ మార్చ్ అనే పత్రికను నడుపుతూ మావోయిస్టు పార్టీ వైపుకు అనేక మందిని యువతను ఆకర్షితులు చేసి పార్టీలో చేరేలా ప్రయత్నం చేయడంలో ఆయన సిద్దహస్తుడని పోలీసులు పేర్కోంటున్నారు.
ఇది ఇలా ఉంటే 2018లో ఎటపాక పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు అయిన ఆయన మళ్లీ బయిటకు వచ్చిన తరువాత కూడా మావోయిస్టు పార్టీలోనే చురుకుగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చింతూరు పోలీసులు ఆయన ఆచూకీ తెలసుకుని అతడ్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. న్యాయ మూర్తి అతడికి రిమాండ్ విధించారు. దీంతో అతడిని. రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు