Friday, November 22, 2024

AP . కేంద్రం నుంచి ఎపికి సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా … ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించనున్న చంద్రబాబు

అమరావతి – ఎపీ సర్వీస్‌లోకి సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. 1998 ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారాయన. ఐపీఎస్ లడ్డాను రాష్ట్ర సర్వీస్‌లోకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండురోజుల కిందట కేంద్రానికి లేఖ రాశారు. వెంటనే ఆయనను ఏపీ సర్వీసులకు పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.


ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరు ఉంది. లా అండ్ ఆర్డర్‌లో ఆయన కాంప్రమైజ్ కారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అనే పేరు కూడా ఆయన సొంతం. లడ్డా సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

- Advertisement -

2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడి కత్తి ఘటన జరిగింది. ఆ సమయం లో విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. రాజస్థాన్‌కు చెందిన మహేష్‌చంద్ర లడ్డా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1998 ఏపీ బ్యాచ్‌కు చెందిన ఆయన, విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహేష్ చంద్ర లడ్డాపై నక్సల్స్ దాడి జరిగింది. ఆ ఘటనలో తృటిలో తప్పించుకున్నారు.

గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపడమేకాదు, క్లబ్‌లపై దాడులు చేశారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయనను ఏరి కోరి తీసుకొస్తున్నారు. ఆయనకు కీలక పదవి అప్పగించే అవకాశమున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement