మదనపల్లి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఆ పార్టీపై, సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. దీంతో సామాన్యులు సైతం జగన్ పాలన తీరును విమర్శిస్తున్నారు.
ఇక.. మదనపల్లె నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షాజాహాన్ బాషా సోదరుడు అయిన నవాజ్ బాషా ఇవ్వాల (శుక్రవారం) టీడీపీలో చేరారు. యువగళం పాదయాత్రలో భాగంగా మదనపల్లిలో పర్యటిస్తున్న నారా లోకేష్ ఆయనకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.