ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య ఋతువు సోమవారం ప్రారంభమయినది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంజని వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.