Tuesday, November 19, 2024

AP – అందరినీ ఇంటికి చేరుస్తాం – కేదార్​నాథ్​లో చిక్కిన భక్తులకు లోకేష్ హామీ

హెలికాప్టర్​ ఏర్పాటు​ చేయాలని ఎంపీ అభ్యర్థన
స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయనగరం బ్యూరో) : కేదార్​నాథ్​లో చిక్కుకున్న తెలు యాత్రికులను సురక్షితంగా తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్​ హామీ ఇచ్చారు. ఎవరూ భయపడవద్దని.. నేనున్నానని అభయం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నామని ఈ లోగా వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామని అన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో నలుగురు ఏపీ, తెలంగాణ యాత్రికులు చిక్కుకున్నారు. ఈ నెల 11 నుంచి అక్కడే నిలిచి పోయారు.

ఏపీ, తెలంగాణ నుంచి సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా 18 మంది కేదార్ నాథ్ వెళ్లారు. కేదార్‌నాథ్‌ దర్శనం తర్వాత వీరిలో 14 మంది తిరుగు పయనం అమయ్యారు. విజయనగరానికి చెందిన శ్రీనివాసరావు, హేమలత, సుధాకర్ కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయారు. వీరితోపాటు తెలంగాణ నిజామామాద్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు కూడా వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

ఈ విషయం తెలిసి ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. వీరిని తరలించేందుకు హెలికాప్టర్లను ఏర్పాటు చేయాలని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. కేదార్‌నాథ్‌లో ఉన్న యాత్రికులతో ఎంపీ ఫోన్‌లో మాట్లాడారు. అధికారులతో మాట్లాడామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. యాత్రికుల ఇబ్బందులపై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కూడా స్పందించారు. కేదార్ నాథ్ లో చిక్కుకున్న విజయనగరం వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రస్తుతం తాము సేఫ్ జోన్ ఉన్నామని బాధితులు సమాచారం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement