ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీ సత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గం చెన్న కొత్తపల్లి మండలం ముష్టి కోవెల గ్రామంలో వినాయక నిమజ్జనంలో అపశృతి కలవరం సృష్టించింది. దైవ ప్రసాదం ఆరగించి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. . బాధితులను హుటాహుటిన కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల కోసం తయారు చేసిన ప్రసాదం నిమజ్జనం అనంతరం సాయంత్రం 7 గంటలకు భక్తులు పులిహోర తిన్నారు. అర్ధరాత్రి నుంచి భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భక్తులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో బాధితులను చెన్నె కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పులిహోర తయారీకి కాలం చెల్లిన నూనె వాడినట్టుగా అనుమానిస్తున్నారు. అందరికీ వైద్య సేవలు అందిస్తున్నామని, భక్తుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
- Advertisement -