Sunday, January 19, 2025

AP l విబేధాలు వీడి కలసికట్టుగా పని చేయండి : పార్టీ శ్రేణులకు అమిత్‌షా పిలుపు

విజయవాడ : ఏపీకి కేంద్రం అందిస్తు్న్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం విజయవాడలోని నోవోటేల్‌లో ఇవాళ(ఆదివారం) జరిగింది

దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు 20 మంది నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీజేపీ కేడర్‌కు కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందజేసే సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపైన చర్చ జరిగినట్లు సమాచారం.

ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నేతలకు అమిత్ షా సూచించారు. పార్టీ బలోపేతానికి నేతలు అందరూ కృషి చేయాలని, అంతర్గత విభేదాలు పక్కన పెట్టి.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అమిత్ షా ఆదేశించారు

.’హైందవ శంఖారావం” సభ విజయవంతం అవడంపై వీహెచ్‌పీ నేతలు, పార్టీ నేతలను అమిత్ షా అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement