Monday, November 25, 2024

AP – దసరా తర్వాత కుంకీలు రాక – క‌ర్నాట‌క సిఎంకు ప‌వ‌న్ థ్యాంక్స్

కర్నాటకతో ఏపీ ఒప్పందం
ఆరు అంశాలపై ఇరు అటవీశాఖలు సంతకాలు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ) – పంట పొలాలపై ఏనుగుల దాడులను నిరోధించేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించాలనే ఏపీ సర్కారు ఓ కొలిక్కి వచ్చింది. కర్నాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య విజయవాడలో ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీశాఖ అధికారుల మధ్య ఆరు అంశాల పత్రాలపై శుక్రవారం సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్నాటక మంత్రి ఈశ్వర్ కండ్రే, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంట పొలాలను ఏనుగులు విధ్వంసం చేస్తున్నాయని.. గిరిజన ప్రాంతాలలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

ఈ విషయాలను సీఎం చంద్రబాబుకు కూడా వివరించానన్నారు. కర్నాకటలో కుంకీ ఏనుగులతో ఏనుగుల దాడిని నివారించవచ్చని గుర్తించామన్నారు. సీఎం ఆదేశాలతో కర్నాటక ప్రభుత్వంతో చర్చలు చేశానని.. విధాన్ సౌధకు వెళ్లి అక్కడ అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు. సీఎం సిద్దరామయ్యను కూడా కలిసి కోరగానే మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

దసరాకు కుంకీలు రెడీ

- Advertisement -

అటవీశాఖలో ఇరు రాష్ట్రాల మధ్య ఎం.ఓ.యూలు తీసుకోవడం ఇదే ప్రథమమన్నారు ప‌వ‌న్ . ఆరు అంశాలపై ఈ ఒప్పందాలు నేడు చేసుకున్నామని, మనకు ఏనుగులు సంఖ్య ఎక్కువ.. వాటిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచన చేశామన్నారు. . మావటీలు, కావటీలకు శిక్షణ, సామర్ధ్యం పెంచేలా ఏనుగుల శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. . కుంకీ ఏనుగులను దసరా తర్వాత ఇక్కడకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తామన్నారు.

ఏనుగు శిబిరాల సంరక్షణకు పోషకాహారం, ఆరోగ్యం కోసం నాలెడ్డ్ ట్రాన్స్ పర్స్ అందిస్తాం. ఇంటర్ స్టేట్‌ల కోఆర్డినేషన్ ‌ల ద్వారా ఎర్రచందనం, శ్రీగంధం చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామన్నారు. ఇలాంటి ఎం.ఓయూ గత వైసీపీ ప్రభుత్వం చేసి ఉంటే… తరలిపోయిన ఎర్ర చందనం మనకు తిరిగి వచ్చేది’’ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

కర్నాటక ఐటీ పనితీరు అద్భుతం…
కర్నాటకలో ఐటీ పనీతీరు చాలా అద్భతంగా ఉందని పవన్ కొనియాడారు. ఒక చెట్టు పడిపోయినా, ఆక్రమణలు గురైనా వెంటనే యాప్‌లో చూసే వీలుందన్నారు. ఆ టెక్నాలజీని కూడా రాష్ట్రానికి తీసుకువస్తున్నామని తెలిపారు. కర్నాటకలో ఎకోటూరిజం ద్వారా ఉద్యోగాలు ఎక్కువ అని.. చంద్రబాబు కూడా దీనిపై ఇప్పటికే చర్చించారన్నారు. అక్కడ పని విధానాన్ని పరిశీలించి.. ఇక్కడ కూడా అమలు చేస్తామని వెల్లడించారు. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో వీటి అమలు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఈ ఎం.ఓయూని ముందుకు తీసుకు వెళ్లడానికి స్వాతంత్ర్య సమరయోధుడు భీమన్న కుమారుడు కీలకంగా వ్యవహరించారని చెప్పారు.

సీఎం సిద్ధ కు పవన్ థ్యాంక్స్

కర్నాటకలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. రెండు విభిన్న ప్రభుత్వాలు ఉన్నా.. ఈ ఒప్పందాలు ప్రజల అవసరాల కోసం చేసుకున్నామని తెలిపారు ప‌వ‌న్. పార్టీలు వేరైనా.. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చినందుకు కర్నాకట సీఎం సిద్దరామయ్య, ఈశ్వర్ కండ్రేకు ధన్యవాదాలు తెలియజేశారు. కోట్ల విలువైన ఎర్ర చందనం ఏపీ నుంచి రవాణా చేస్తుండగా కర్నాటకలో పట్టుకున్నారన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడి… ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధిస్తామని పవన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement