Friday, October 18, 2024

AP: కృష్ణా తీరం.. ఆధ్యాత్మిక శోభితం

రెండో రోజు నారీ శక్తి విజయోత్సవం
భారీగా హాజరైన మహిళలు..
బబ్బూరు గ్రౌండ్స్ లో కుటుంబాలతో తరలి వచ్చిన ప్రజలు
ఆకట్టుకున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు
భక్తి పారవశ్యంతో తిలకించిన ప్రజలు

ఆంధ్రప్రభ స్మార్ట్‌, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ బబ్బూరి గ్రౌండ్స్ లో నారీ శక్తి విజయోత్సవం రెండో రోజు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతోగానో ఆకట్టుకున్నాయి.. నారీ శక్తి విజయోత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళా శక్తి ధ్వనించేలా ప్రాంగణమంతా సందడి నెలకొంది. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళా రూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అబ్బుర పరచాయి.

అల‌రించిన కొమ్ము నృత్యం
గిరిజన వేషధారణతో డప్పులతో ప్రదర్శించిన కొమ్ము నృత్యం మహిళలను ఆకర్షించింది. కొండల్లో, కోనల్లో జీవించే గిరిజనలు చేసే నృత్యాలను కళాకారులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించటం ప్రజలను ఆకట్టుకుంది.

- Advertisement -

పోతురాజుల విన్యాసాలు..
వివిధ పండుగల్లో పోతురాజ వేషధారణతో, ఎంతో భక్తి పారవశ్యంతో ప్రదర్శించే పోతురాజుల విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. 15 మంది బృందం ప్రదర్శించిన పోతురాజుల విన్యాసాలను ప్రజలు ఆసాంతం తిలకించారు.

జానపద డప్పు నృత్యం
15 మంది జానపద కళాకారులు జానపద డప్పు నృత్యాన్ని ప్రదర్శించారు.. వివిధ భంగిమల్లో నృత్యం చేస్తూ, పిరమిడ్ ఆకారంగా చేస్తూ, జానపద పాటలు, భక్తి పాటలు పాడుతూ ప్రజలను రంజింప చేశారు. జానపద డప్పు వాయిద్యం వాయిస్తూ ప్రజలను ఆహ్లాదపరచారు. వీరు ప్రదర్శించే ప్రదర్శనలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని ఇక్కడికి వచ్చిన మహిళలు తెలియచేశారు. మహిళలు ప్రదర్శించిన బోనాలు కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement