Friday, November 22, 2024

AP – పవన్ కల్యాణ్ టీంలో ఇక ” కృష్ణతేజం “

కృషీవలుడు కృష్ణ‌తేజ‌

విన‌య‌ విధేయుడిగా పేరు

ఏపీకి వ‌చ్చిన‌ కేరళ కేడర్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌

ఆమోదించిన కేంద్రం..

ఉత్తర్వులు జారీ ఫలించిన డిప్యూటీ సీఎం పవన్ అభ్యర్థన

- Advertisement -

ఇక కీలక శాఖల బాధ్యతలు పల్నాడు బిడ్డకే

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: బాలల రక్షణలో త్రిస్సూర్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన కేరళ కేడర్‌ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ డిప్యూటేషన్‌పై ఏపీకి వస్తారని, కీలక బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం నిజమైంది. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు కృష్ణతేజను డిప్యూటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు పంచాయతీ రాజ్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఏపీ ప్రభుత్వం నుంచి అందిన అభ్యర్థన మేరకు మూడేళ్ల పాటు కృష్ణతేజను ఏపీకి డిప్యుటేషన్ పై పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కృష్ణతేజ కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు.

కాగా, అంతకుముందు సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ క‌ల్యాణ్‌తో ఐఏఎస్ కృష్ణతేజ సమావేశమైన సంగతి తెలిసిందే.డిప్యూటీ సీఎం ప్రశంసలు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ పేరు తెరపైకి వచ్చింది. త్రిస్సూర్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన బాలల రక్షణలో త్రిస్సూర్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన కృషికి జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారం వరించింది.ఈ మేరకు డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.అప్పటినుంచి ఆయన పేరు మార్మోగుతోంది.

పల్నాడు బిడ్డకు ఆహ్వానం

గుంటూరులోని పల్పాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ 2014 సివిల్స్‌లో 66వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్‌లో చేరిన తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, నాణ్యమైన విద్య వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ..అందుకు కృషి చేస్తున్నారు. 2018లో కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజ 2.50లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే సరస్సును ఆక్రమించి నిర్మించిన 54 ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement