ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు.
ఐదుగురు ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా వేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు లక్ష మందికి పైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 80 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.