కేరళ యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ ఏపీకి రానున్నారు. కేరళ నుంచి ఏపీకి మూడేళ్లపాటు డిప్యుటేషన్‌కు అనుమతిస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (డీఓపీటీ)గా కృష్ణతేజను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కృష్ణతేజ ఆంధ్రాకు వచ్చి ఛార్జ్ తీసుకోనున్నారు.
కృష్ణతేజ గతంలో కేరళ కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ మధ్యే త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక కూడా చేసింది.
బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపినందుకు గానూ కృష్ణతేజకు ఈ అవార్డును ఇచ్చారు. ఇక ఐఏఎస్ కృష్ణతేజ ఆంధ్రాకు చెందిన వ్యక్తి. ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కృష్ణతేజ ఇప్పటికే పలుశాఖల్లో పనిచేశారు. మొదటి నుంచి సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కృష్ణతేజ పేరు సంపాదించుకున్నారు.