వైసిపి కార్యాలయాల కూల్చివేతలపై
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అనుమతుల రికార్డ్ లు చూపాలంటూ వైసిపికి అదేశం
ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే చర్యలు చేపట్టండి
అమరావతి – వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఖాళీ చేసింది. కూల్చివేతల్లో చట్టపరమైన నిబంధనలు పాటించాలని సూచించింది. అలాగే, ప్రతి దశలోనూ వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. అంతేకాదు.. 2 నెలల్లో భవనాల అనుమతులు, ఆధారాలు, రికార్డులు అధికారుల ముందు ఉంచాలని వైసీపీని న్యాయస్థానం ఆదేశించింది. తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా ఉంటే తప్ప కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మూసివేసింది.