ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుసగా మూడో రోజైన నేడు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. పిఠాపురం వెళ్తున్నప్పుడు ఆసక్తికర ఘటన ఒకటి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ తమ ఇంటి ముందు నుంచి వెళ్తుందన్న విషయం తెలిసిన ఓ కుటుంబంలోని చిన్నారి జనసేన జెండా పట్టుకుని రోడ్డు పక్కన నిల్చుని ఊపుతున్నాడు. అంతలోనే అటుగా వచ్చిన పవన్ అదిచూసి తన కారు ఆపారు. కారు ఆగడంతోనే చిన్నారి పరిగెత్తాడు. కిందికి దిగిన పవన్ ఆ బాలుడిని అప్యాయంగా పలకరించారు. అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చి కారెక్కబోయారు. ఈలోపు అక్కడికి వచ్చిన అభిమానుల్లో ఒకరు పవన్ కాళ్లకు దండం పెట్టడం కనిపించింది.
AP – చిన్నారి చేతిలో జనసేన జెండా… కారు దిగి షెక్ హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్..
Advertisement
తాజా వార్తలు
Advertisement