Saturday, July 6, 2024

AP – చిన్నారి చేతిలో జ‌న‌సేన జెండా… కారు దిగి షెక్ హ్యాండ్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుసగా మూడో రోజైన నేడు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. పిఠాపురం వెళ్తున్నప్పుడు ఆసక్తికర ఘటన ఒకటి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ తమ ఇంటి ముందు నుంచి వెళ్తుందన్న విషయం తెలిసిన ఓ కుటుంబంలోని చిన్నారి జనసేన జెండా పట్టుకుని రోడ్డు పక్కన నిల్చుని ఊపుతున్నాడు. అంతలోనే అటుగా వచ్చిన పవన్ అదిచూసి తన కారు ఆపారు. కారు ఆగడంతోనే చిన్నారి పరిగెత్తాడు. కిందికి దిగిన పవన్ ఆ బాలుడిని అప్యాయంగా ప‌ల‌కరించారు. అనంత‌రం షేక్‌హ్యాండ్ ఇచ్చి కారెక్కబోయారు. ఈలోపు అక్కడికి వచ్చిన అభిమానుల్లో ఒకరు పవన్ కాళ్లకు దండం పెట్టడం కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement