Saturday, November 23, 2024

ఏపీలో ప్రభుత్వ కార్యాలయల పనివేళల్లో మార్పులు..

కరోనా కారణంగా ఏపీలో ప్రభుత్వ కార్యాలయల పనివేళలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యలయాల పనివేళను పునరుద్ధిరిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. అయితే మార్చిన పనివేళలను ఓసారి పరిశీలిస్తే..రేపటి నుంచి ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కార్యాలయాలు పనిచేస్తాయనున్నాయి. సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్ల కార్యాలయాలకు ఇవే పనివేళలు వర్తిస్తాయని ఏపీ సర్కార్‌ స్పష్టం చేసింది. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం సెలవు ఉంటుందని వెల్లడించింది. సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్ల కార్యాలయాలకు వారానికి రెండ్రోజులు సెలవులు ఉంటాయి. ఈ కార్యాలయాలు మరో ఏడాదిపాటు వారానికి ఐదురోజులే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ఇది వార్త కూడా చదవండి : మరో రెండు నెలల పాటు ‘డెల్టా’ ప్రభావం

Advertisement

తాజా వార్తలు

Advertisement