అమరావతి, ఆంధ్రప్రభ : పాలిటెక్నిక్‌లోని డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలలో 2022, 2023 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు, 1 నుండి 3 సంవత్సరాల అనుభవం కలిగియున్న అభ్యర్థుల కోసం విశాఖ వేదికగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పునరుత్పాదక ఇంధన పరిష్కారాల ప్రొవైడర్‌గా ఉన్న సుజ్లాన్ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా దేశవ్యాప్తంగా డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ అవకాశాల కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామన్నారు.
జనవరి 8, 9 తేదీలలో విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్‌లో దీనిని నిర్వహిస్తున్నామని నాగరాణి తెలిపారు. అదనపు సమాచారం కోసం సాంకేతిక విద్యా శాఖ ట్రైనింగ్, ప్లేసెమెంట్ విభాగం అధికారులను 7382082692, విశాఖపట్నం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సిబ్బందిని 7382463845 నెంబర్ లలో సంప్రదించవచ్చని ఆమె వివరించారు.