Tuesday, November 26, 2024

AP | జెఈఈ మెయిన్స్ రిజిష్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ: జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్‌ 2024 రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ మెయిన్‌ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన అప్లికేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 30 వరకు కొనసాగనుంది.

అభ్యర్థులు పూర్తి వివరాలను జెఈఈ మెయిన్స్‌ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. జేఈఈ మెయిన్‌ 2024 తొలి సెషన్‌ 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య జరుగుతుంది. అనంతరం.. రెండో సెషన్‌ 2024 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీల మధ్య జరుగుతుంది.

జేఈఈ మెయిన్‌ 2024 పరీక్ష రాయాలనుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి వయో పరిమితి నిబంధనలు లేవు. 2021 లేదా 2022 లో క్లాస్‌ 12 లేదా ఇంటర్మీడియెట్‌ రెండవ సంవత్సరం పాస్‌ అయిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. అలాగే 2024 మార్చిలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే.

- Advertisement -

జెఈఈ (మెయిన్‌) సెషన్‌-1..

జనవరిలో జరిగే పరీక్షలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. పరీక్షలు 2024 జనవరి నుంచి పిభ్రవరి 1 వరకు జరుగనున్నాయి. జనవరి రెండవ వారంలో పరీక్షా కేంద్రాలను ప్రకటించనున్నారు. ఫలితాలను ఫిబ్రవరి 12వ తేదీన ప్రకటించనున్నారు.

జేఈఈ (మెయిన్‌) సెషన్‌-2..

2024 ఏప్రిల్‌ లో జరుగనుంది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి 14 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి మూడవ వారంలో పరీక్షా కేంద్రాలను ప్రకటిస్తారు. ఫలితాల తేదీని ఇంకా ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement