Saturday, November 23, 2024

ఏపీ జేఈఈ మెయిన్స్‌ అడ్మిన్‌ కార్డులు విడుదల.. ఈనెల 24 నుంచి పరీక్షలు

అమరావతి,ఆంధ్రప్రభ: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలైన ఐఐటి, ఎన్‌ఐటిలతోపాటు ఇతర సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టిఎ) అడ్మిన్‌ కార్డులను విడుదల చేసింది. ఈనెల 24న జరిగే మొదటి పరీక్షకు సంబంధించిన అడ్మిన్‌కార్డులను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆ తర్వాత పరీక్షలకు సంబంధించిన అడ్మిన్‌ కార్డులను ఆదివారం నుండి వరుసగా విడుదల చేయనుంది. మొదట విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 24,25,27,28,29,30,31 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇటీవల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది.

బిఈ, బిటెక్‌ విభాగాల్లో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష జనవరి 24,25,29,30,31, ఫ్రిబవరి ఒకటి తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. బిఆర్క్‌, బీ ప్లానింగ్‌ విభాగంలో పేపర్‌ 2ఏ, 2బీ పరీక్షను జనవరి 28వ తేదీన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షను రాస్తారు.

- Advertisement -

పరీక్షలు నిర్వహించే నగరాల పేర్లను ఇప్పటికే ప్రకటించారు. దేశవ్యాప్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపల 25 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టిఏ తెలిపింది. ఈ ఏడాది జెఇఇ మెయిన్స్‌ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహిస్తుండగా, రెండో విడతను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement