అనంతపురంలో బస్సులపై 11 KV వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదం లో జేసీ దివాకర్ రెడ్డి బస్సులు దగ్ధం అయ్యాయి. ఈ రోజు అంటే గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అటు దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. ప్రస్తుతం మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. .ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.