Friday, September 6, 2024

AP | విధ్వంసానికి మరో పేరు జగన్.. అసెంబ్లీకి రాకుండా కొత్త డ్రామా..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని సంతకాల సేకరించిన‌ జగన్ కు నాటినుండి శ‌వ‌ రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఇద్దరి మధ్య జరిగిన దాడిని రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం దారుణమ‌ని అన్నారు. విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన జగన్ అసెంబ్లీ నుండి తప్పించుకునేందుకు ఢిల్లీ అంటూ కొత్త డ్రామాకు తెర లేపారని విమర్శించారు.

కూటమీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలపై చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ….. బెంగళూరు ప్యాలస్ లో 40 రోజులు డ్రామాలాడి శవాల మీద పేలాలు ఏరుకునేందుకు జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడన్నారు.

శాసనసభలో శ్వేతపత్రంపై చర్చ పెడుతున్నాం మాట్లాడమని ప్రభుత్వం చెప్పిందనీ, చర్చకు రాకుండా ఢిల్లీ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడనీ అన్నారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కాలేదు. రాష్ట్రం ముందుకెళ్లాలని అందరూ కోరుకుంటుంటే నీకు రాష్ట్రపతి పాలన కావాలా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో విద్వంసకర రాజకీయాలకు జగన్మోహన రెడ్డి తెరలేపాడనీ, శాంతి భద్రతల చర్చ జరుగుతుందని ఏ రోజు వార్తలు వచ్చాయో ఆరోజే మిథున్ రెడ్డి రెడ్డప్పను కలవడానికి వెళ్తాడనీ అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాడిని రాజకీయ రంగు పులిమి విద్వేషాలు రెచ్చగొడుతున్నారనీ ఆరోపించారు. నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం ఎన్ని కోట్లు తీసుకువెళ్లారో ఎన్ని కోట్లు ఎవరికి ఇచ్చారో ఆర్థిక శాఖ లెక్కలు తీస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో పరిశ్రమలు తీసుకురావడంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement