Sunday, June 30, 2024

AP – జగన్ బుక్ యూటర్న్ .. ఆ భూ హక్కు పత్రం ఇక చెల్లదు

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – జగనన్న భూ రక్షణ పథం పేరిట ..జగనన్న భూహక్కు పత్రంపై మాజీ సీఎం జగన్ ఫోటోతో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై అప్పటి విపక్షం తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక రైతులు కూడా తమ భూమి హక్కుభుక్తం కాస్త అప్పటి సీఎంకే దక్కుతోందని సెంటిమెంట్ గా ఫీలయ్యారు. ఎన్నికల్లో హామీ అమలుకు తాజా సీఎం చంద్రబాబు నాయుడు తక్షణం స్సందించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్ పై సంతకం చేశారు. కేబినేట్ కూడా ఆమోదం తెలిపింది. అంతలోనే రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. వేగిరంగా స్పందించారు. రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. అందులో లోటుపాట్లను గ్రహించి.. తక్షణమే మాజీ సీఎం జగన్ ఫొటోతో పంపిణీ చేసిన 20.19 లక్షల పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకునే పనిని రెవెన్యూ అధికారులు ప్రారంభించారు.


ఏం జరిగింది? ఎలా జరిగింది ?
భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్, సర్వేశాఖ కమిషనర్ సిద్దార్థ్ జైన్‌ తో రెవెన్య మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చలో ఇప్పటి వరకూ ఏమి జరిగిందంటే? ఇప్పటి వరకూ 13,321 గ్రామాల్లో డ్రోన్లతో 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల లో రీ సర్వే జరిగింది. 12,348 గ్రామాలకు చిత్రాలు పంపించారు. రైతుల ఆమోదంతో 7,110 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించారు. 6,707 గ్రామాల్లో విస్తీర్ణాన్ని నిర్ధారించారు. 6,353 గ్రామాల్లో రీ సర్వే జరిగినట్టు నోటిఫికేషన్ ఇచ్చారు. నట్టు. 6,316 గ్రామాల్లో రికార్డుల్లో నమోదు ప్రక్రియ జరిగింది. సర్వే నెంబర్ల స్థానంలో 81 లక్షల ల్యాండ్ పార్సిల్లను జనరేట్ చేశారు. 8.64 లక్షల యజమానుల పేర్లను రికార్డుల్లో బదిలీ చేశారు. 86 వేల వివాదాలు పరిష్కరించారు. 22.48 లక్షల యజమానుల పేర్లను రికార్డుల్లో నమోదు చేశారు. జగనన్న పేరుతో ఆయన ఫొటోతో 74.65 లక్షల రాళ్లను పొలాల్లో సర్వే రాళ్లు పాతారు.

ఆ పుస్తకాలు మర్యాదగా వెనక్కి

- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు జగన్ ప్రభుత్వం రూ. 20.19 లక్షల భూహక్కు పత్రాలను పంపిణీ చేసింది. మరో లక్ష పుస్తకాలు పంచాలి. ఈ నేపథ్యంలో పంపిణీ చేసిన వాటిని వెనక్కి తీసుకుని, ఉన్నవాటిని నిలిపి వేసి కొత్తగా డిజైన్ చేసి అధికారిక ముద్రతో పంపిణీ చేయనున్నారు. అలాగే, గత ప్రభుత్వం. జగనన్న సర్వే రాళ్లను తొలగించి కొత్త సర్వే రాళ్లను పాతరేస్తారు. ఇక గ్రామాల్లో మళ్లీ పొలాల సండడి షురూ .

Advertisement

తాజా వార్తలు

Advertisement