Monday, January 6, 2025

AP – ప‌థ‌కాలు అమలులో చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం – ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్ ఆగ్ర‌హం

అంతా మోసం అంటూ కూట‌మి స‌ర్కార్ ను నిల‌దీత‌
అమ్మ ఒడి కి ఓ ఏడాది బంద్
వ‌చ్చే ఏడాది అంటూ మ‌రో ద‌గా
రైతు బ‌రోసాకు గ్యారంటీ ఇవ్వ‌ని చంద్ర‌బాబు
ఇప్ప‌టికే రెండు సీజ‌న్ లు ఎగ‌గొట్టారంటూ ఫైర్..

వెల‌గ‌పూడి – ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు హామీలు, వాటిని పెంచి ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న తీరును టార్గెట్ చేస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు.

చంద్రబాబు గారూ.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అంటూ జగన్ ట్వీట్ లో ఏకి పారేశారు.

- Advertisement -

అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తుచేశారు.
” వరుసగా కేబినెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ ఆక్షేపించారు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారన్నారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…? అన్నారు.

మరోవైపు రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని జగన్ ఆరోపించారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని విమర్శించారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు తాము పెట్టామని,, కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఒక్కపైసా ఇవ్వలేదన్నారు.

అలాగే ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే అని జగన్ విమర్శించారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే అన్నారు. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోందన్నారు జ‌గ‌న్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement