Monday, November 25, 2024

AP | రానున్న రెండు రోజులు వర్షాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఐఎండి సూచనల ప్రకారం ఈశాన్య రాజస్థాన్‌ నుండి దక్షిణ ఇంటీ-రియర్‌ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక వద్ద ఆవర్తనం మీదుగా సముద్ర మట్టానికి సగటు-న 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు.

శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement