చంద్రబాబు అభ్యర్ధనకు కేంద్ర ఓకే
ఇక అన్నక్యాంటిన్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు
దాని ద్వారా నిధుల సమీకరణ
విరాళాలు ఇకపై ట్రస్ట్ కే అందించాలి
అమరావతి – ఏపీలో అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఇక ఆదాయపన్ను మినహాయింపు లభించనుంది. ఈ మేరకు చంద్రబాబు కేంద్రానికి చేసిన అభ్యర్ధనకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ‘అన్న క్యాంటీన్’ పేరుతో ఛారిటబుల్ ట్రస్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ట్రస్ట్ కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించనున్నారు.. ఇందుకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాలనుంచి అనుమతులు లభించాయి. వచ్చే నెలలో ట్రస్టు ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి విరాళాలు ట్రస్ట్ ఇవ్వవలసి ఉంటుంది.. ట్రస్ట్ కు ఇచ్చిన విరాళంపై ఆదాయపన్ను చట్టం 80 సిసి ప్రకారం వంద శాతం పన్ను మినహాయింపు ఇస్తారు.