Thursday, November 21, 2024

తిరుపతి నుంచి త్వరలో ఇంటర్ నేషనల్ విమాన సర్వీసులు.. ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న ఏపీ

తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. తిరుపతి విమానాశ్రయానికి 2017లో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించింది. అయితే కొన్ని కారణాల వల్ల అంతర్జాతీయ సర్వీసులు టేకాఫ్ కాలేదు. కాగా, తిరుపతి నుంచి అంతర్జాజీయ సర్వీసులు ప్రారంభం అవుతాయాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తిరుపతి నుండి ప్రపంచ నగరాలకు విమానాలను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL), స్థానిక YSRCP MP M గురుమూర్తి, విమానాశ్రయ అధికారులు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొదట తిరుపతి విమానాశ్రయం నుండి కువైట్‌కు సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నారు.

ముఖ్యంగా చిత్తూరు, రాజంపేట, రాయచోటి, నెల్లూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు పనుల నిమిత్తం వెళ్లే రాయలసీమ ప్రజలకు తిరుపతి విమానాశ్రయం ఎంతో సౌకర్యంగా ఉంది. ప్రస్తుతం వీరంతా చెన్నై వెళ్లి అక్కడి నుంచి విమానంలో వెళ్లాల్సి వస్తోంది. అంతర్జాతీయ సర్వీసులు సత్ఫలితాలనిచ్చేలా కేంద్రంతో ఎంపీ గురుమూర్తి సంప్రదింపులు జరుపుతున్నారని, అతి త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement