అమరావతి : తుపాను, భారీ వర్షాల కారణంగా ఏపీలో ఈనెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాపై కలెక్టర్లకు సమాచారం పంపారు. తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల ఎన్నికలకు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ను విడుదల చేసింది. 6,149 సాగునీటి సంఘాలు , 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ను విడుదల చేసి ఓటరు జాబితాల రూపకల్పన, చేపట్టాల్సిన ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఫెయింజల్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది.
- Advertisement -