Friday, November 22, 2024

AP – ఇంటర్మీడియట్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల

ఏపీ ఇంట‌ర్‌ ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫ‌లితాల‌ను సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/లో ఇంటర్ ఫస్టియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాల‌ను చూసుకోవచ్చు.


జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో 80 శాతం, వొకేష‌న‌ల్‌లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు ఇంట‌ర్ బోర్టు అధికారులు వెల్ల‌డించారు. ఉత్తీర్ణులైన అభ్య‌ర్థుల మార్కుల మెమోల‌ను జులై 1వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపారు.

- Advertisement -


కాగా, ఇంటర్ అడ్వాన్స్‌‌డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు ఉంటే.. మరికొందరు ఇంప్రూవ్ మెంట్ కోసం రాసిన‌ వారున్నారని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement