ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది.
ఈసారి ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన వివరాలను ఈ నెల 10వతేది మధ్యాహ్నంతో పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి, ఇంటర్ బోర్డు అధికారులు నేటి ఉదయం 11గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను httsps://resultsbie.ap.gov.in/తో పాటు కూడా చెక్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617మంది, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరైనట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
- Advertisement -