Wednesday, November 20, 2024

AP మీ స్ఫూర్తితోనే ఈ సాయం … చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ల్యాణ్


ఆరుకోట్లు విరాళం ఇచ్చిన ప‌వ‌న్ కు సిఎం అభినంద‌న‌లు
మీ పాల‌న ద‌క్ష‌ణ‌, విధి నిర్వ‌హ‌ణే మాకు స్పూర్తి అన్న‌జ‌న‌సేనాని
టెక్నాల‌జీ వాడ‌టంలో మీ త‌ర్వాతే నంటూ చంద్ర‌బాబుకి కితాబు
మీ నుంచి చాలా నేర్చుకోవాలి స‌ర్ అంటూ ట్విట్

హైద‌రాబాద్ – ఎపి వరద బాధితులకు ఆరు కోట్ల రూపాయిలు విరాళం ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాతృత్వాన్ని సీఎం చంద్రబాబు ప్ర‌శంసించారు.. ఇంత భారీ మొత్తంలో విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. దీనిపై పవన్ స్పందించారు. మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించారు అంటూ చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

“అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ అనేవి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం వచ్చి పడింది. వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు (చంద్రబాబు) కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇటువంటి కష్ట సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ యుద్ధప్రాతిదికన పాల్గొంటున్నాయి. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నాను” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన తాలూకు ఫొటోలను కూడా పవన్ పంచుకున్నారు.

మీ నుంచి మేం చాలా నేర్చుకోవాలి స‌ర్…

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వాలు స‌హాయ చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి. ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా స‌హాయ‌క చ‌ర్యల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించ‌డం, నేరుగా వ‌ర‌ద‌ బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోవ‌డం ప్రత్యేకంగా నిలిచింది. బాధితులు ప‌స్తులు ఉండ‌కుండా డ్రోన్ల‌ను ఉప‌యోగించి ఆహారాన్ని అందించారు.

ఇలా డ్రోన్ స‌హాయంతో వ‌ర‌ద బాధితుల‌కు ఆహారాన్ని అందించిన ఫొటోల‌ను డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై జ‌న‌సేనాని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆప‌ద‌లో ఉన్న‌వారికి స‌హాయం చేసేందుకు వినూత్న మార్గాల‌ను అన్వేషించే చంద్ర‌బాబును త‌ప్ప‌కుండా అభినందించాల‌ని ట్వీట్ చేశారు.
“డ్రోన్ల ద్వారా వ‌ర‌ద బాధితుల బాధ‌ల‌ను ఎలా త‌గ్గించ‌వ‌చ్చో ఈ ఫొటోల‌ను చూస్తుంటే మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది. ఆప‌ద‌లో ఉన్న‌వారికి స‌హాయం చేసేందుకు వినూత్న మార్గాల‌ను అన్వేషించే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మ‌నం త‌ప్ప‌కుండా అభినందించాలి. మీ నుంచి చాలా నేర్చుకోవాలి స‌ర్‌. ఏపీలో మీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం అంద‌రికీ స్ఫూర్తినిస్తుంది” అని ప‌వ‌న్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement