Thursday, October 24, 2024

Delhi | కేంద్ర కేబినెట్ లో ఏపీకి వ‌రాలు..

  • అమ‌రావ‌తికి కొత్త రైల్వే లైన్
  • ఎర్రుపాలెం నుంచి అమ‌రావ‌తికి కొత్త రూట్
  • 57 కిలోమీట‌ర్ల లైన్ నిర్మాణానికి రూ.2245 కోట్లు వ్య‌యం
  • ఎర్రుపాలెం కృష్ణాన‌దిపై 3.20 కిలో మీటర్ల రైల్వే వంతెన నిర్మాణం
  • ఇకపై ప్ర‌తి ప్ర‌ధాన రైళ్లు అమ‌రావ‌తిలో ఆగేలా నిర్ణ‌యం

న్యూఢిల్లీ – కేంద్ర కేబినెట్ లో ఏపీకి వ‌రాలు కురిపించారు.. ప్ర‌దాని మోడీ అధ్య‌క్ష‌తన ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన కేబినేట్ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.. ముఖ్యంగా అంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌లు ప్రాజెక్ట్ ల‌కు మోడీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.. అమ‌రావ‌తి రైల్వే లైన్ ను మంజూరు చేసింది. విజ‌య‌వాడ‌, గుంటూరు, తెనాలి మార్గాన్ని అనుసందానిస్తూ అమ‌రావ‌తి రైల్వే లైన్ ను నిర్మించ‌నున్నారు..

ఇక ఎర్రుపాలెం కృష్ణా న‌దిపై రైలు వంతెన నిర్మించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.. మొత్తం 3.2 కిలోమీట‌ర్ల రైల్వే వంతెన తో పాటు 57 కిలోమీట‌ర్ల రైల్వే లైన నిర్మాణ కోసం రెండు వేల 245 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.. ఈ రైల్వై లైన్ ఏర్రుపాలెం నుంచి అమ‌రావ‌తి మీదుగా నంబూరు వ‌ర‌కు నిర్మించ‌నున్నారు.

ఈ రైల్వే లైన్‌తో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు కానుంది. అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఈ రైల్వేలైన్‌ ఏర్పాటు కానుంది.

ఏపీ, బిహార్‌ రాష్ట్రాలకు రెండు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి అంచనా వ్యయం మొత్తంగా రూ.6,798 కోట్లు. ఇందులో అమరావతి రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు కాగా.. బిహార్‌లో రైల్వే లైన్‌కు రూ.4,553 కోట్లు కేటాయించింది.

- Advertisement -

ఏపీలో కొత్త రైల్వే లైన్‌ అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు మధ్య ఏర్పాటు కానుంది.

అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు IN-SPACe ఆధ్వర్యంలో రూ.1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఫండ్ దాదాపు 40 స్టార్టప్‌లకు తోడ్పాటు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ప్రోత్సహం కల్పించేలా ఈ నిధి ఉపయోగపడనుంది.

బిహార్‌లో రూ.4,553 కోట్లతో నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా; సీతామర్హి-ముజఫర్‌పుర్ కారిడార్‌ డబ్లింగ్‌కు పనులు చేపట్టనున్నారు. మొత్తంగా 256 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టుతో ఉత్తరప్రదేశ్, ఉత్తర బిహార్‌లకు ప్రయోజనం చేకూరనుంది. నేపాల్‌ అంతర్జాతీయ సరిహద్దుకు సమాంతరంగా కొనసాగే ఈ రైల్వే లైన్‌.. కాఠ్‌మాండూ, జానక్‌పుర్‌, లుంబినీ మధ్య ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్‌, కంటెయినర్లను వేగంగా తరలించేందుకు ప్రత్యామ్నాయంగా ఉండనుంది.

ఏపీ, బిహార్‌లలో చేపట్టే ఈ ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు.

Dailyhunt

అలాగే అన్ని ప్ర‌దాన రైళ్లు అమ‌ర‌వ‌తి మీదుగా ప్ర‌యాణించేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.. ఇక ఈ కేబినేట్ లో వ‌చ్చే నెల ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల‌పై చ‌ర్చించారు.. ఈ సెష‌న్లో ప్ర‌వేశ పెట్ట‌నున్న కొన్ని బిల్లుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement