ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. రెండురోజుల కిందట ఈ వ్యవహారం జరిగినట్టు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆ నోటీసు నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు వచ్చిన సజ్జలను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు.. లుక్ అవుట్ నోటీస్ ఉన్న కారణంగా ప్రయాణానికి అనుమతి ఇవ్వలేమని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు.. కాగా దీనిపై ఎపి డిజిపి ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ, ఎపిలో జరిగిన కొన్ని ఘటనలలో సజ్జలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని చెప్పారు.. దీనిలో భాగంగా ఆయనపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేసినట్లు చెప్పారు..
టిడిపి కార్యాలయం దాడి కేసు ..
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. కొంతమంది నిందితులను విచారించిన నేపథ్యంలో వారిచ్చిన సమాచారం ఆధారంగా సజ్జలను 120వ ముద్దాయిగా ఛార్జిషీటులో చేర్చారు. గతనెలలో మంగళగిరి పోలీసులు సజ్జలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.