Wednesday, January 22, 2025

AP – అమ‌రావ‌తికి రూ.11 వేల కోట్లు హ‌డ్కో రుణం…

వెల‌గ‌పూడి : ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ముంబయిలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకు హడ్కో బోర్డు అనుమతి లభించిందని మంత్రి చెప్పారు. వెల‌గ‌పూడిలో త‌న ఛాంబ‌ర్ లో నేడు జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఈ వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపామని తెలిపారు. నిధుల విడుదలకు హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement