Sunday, November 17, 2024

AP – ఒక్క పులిహోరా ప్యాకెట్ అయినా పంచారా – జగన్ ను దులిపేసిన హోం మంత్రి అనిత

పేటీఎం బ్యాచ్‌తో విష ప్రచారం

మాజీ సీఎం జ‌గ‌న్ తీరు బాలేదు

వ‌ర‌ద బాధితుల‌కు సాయం చేస్తున్నాం

అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉన్న సీఎం చంద్ర‌బాబు

బెంగ‌ళూరులో కూర్చొని విమ‌ర్శ‌లు చేయొద్దు

- Advertisement -

జ‌గ‌న్‌పై ఏపీ హోం మంత్రి అనిత ఆగ్ర‌హం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో :ఏపీలో భారీవర్షాలు, వరదలతో నష్టంపై మాజీ సీఎం జగన్ తన పేటీఎం బ్యాచ్‌తో విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.

ఆదివారం విజయవాడలో మీడియా మాట్లాడుతూ.. తొమ్మిదిరోజులుగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జగదిగ్భందంలో చిక్కుకోగా ప్రభుత్వం, మంత్రులు నిద్రాహారాలు మాని ప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అనుక్షణం విపత్తుపై అప్రమత్తం చేస్తూ కాలనీల్లో పర్యటిస్తూ బాధితులను పరమార్శించారని గుర్తు చేశారు.

బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించామని వివరించారు. అయితే వైసీపీ అధినేత జగన్‌ సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్‌ కూడా ఇవ్వలేదని, బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారని ఆరోపించారు. పట్టుమని 20 నిమిషాలకు కూడా బాధితుల వద్ద గడపలేదని విమర్శించారు.

గణేష్ మండపాలపై..కూడా విష ప్రచారం

గణేష్ మండపాలకు సంబంధించి ఎలాంటి డబ్బులు ప్రభుత్వం వసూలు చేయడం లేదు. మైక్ పర్మిషన్ కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. మండపాలకు సంబంధించి సీఎం ఆదేశాలను మేము 10 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాం. 2022లో గత వైసీపీ ప్రభుత్వం గణేష్ మండపాలపై వసూళ్లను గురించి చెప్పడాన్ని విపక్షానికి చెందిన సోషల్ మీడియా ఏమీ దొరక్క విష ప్రచారం చేస్తోంది. అంటూ అనిత వివరణ ఇచ్చారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement