అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నింటిలో హైకోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెల్లడించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Amaravathi: రాజధాని పిటిషిన్లపై నేడే తీర్పు.. ఏపీవ్యాప్తంగా ఉత్కంఠ
Advertisement
తాజా వార్తలు
Advertisement