ఏపీలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. పరిషత్ ఎన్నికల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి అయినప్పటికీ ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించలేదనే కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసి, మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది.
ఏపీలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే
Advertisement
తాజా వార్తలు
Advertisement