ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్ట్ 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్ట్ 1న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరుకావాలని కోర్టు ఆదేశాలిచ్చింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఆగస్టు మొదటి వారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఏపీ సర్కార్ పై హైకోర్టు సీరియస్
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- Ap government
- AP HIGH COURT
- ap latest news
- AP Nesw
- AP NEWS
- ap news today
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- upadi hami pathakam
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement