Tuesday, November 19, 2024

కుప్పం ఘటన కేసు: టీడీపీ నేతలకు ఊరట

చిత్తూరు జిల్లా కుప్పం ఘటన కేసులో టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కుప్పం- మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ నేతల చేపట్టిన నిరసనపై పోలీసులు నమోదు చేశారు.- ఈ కేసును ఎత్తివేయాలని కోరుతూ టీడీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటీషనర్ల అరెస్టులో పాటు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డితో పాటు మొత్తం 19 మంది పిటీషన్ దాఖలు చేశారు.

కాగా, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు ఈ నెల 9న రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుప్పంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమాలంటూ సోమవారం రాత్రి టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యాలయంపై దాడి చేశారంటూ 19 మంది నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అందులో భాగంగానే అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: మద్యం దుకాణాల రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఏమిటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement