Friday, November 22, 2024

AP: ఈడ‌బ్ల్యూఎస్ కోటా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి: వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాల్‌ చేస్తూ మెడికల్‌ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మెడికల్‌ సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్‌ కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఠాకూర్‌ వాదించారు.

ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్‌ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్దులు నష్టపోతారని వివరించారు. తక్షణమే ఈ జీవోను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు.. జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఆరు వారాలకు వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement