Wednesday, November 20, 2024

టీడీపీ నేత పట్టాబికి బెయిల్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు అయింది. శనివారం బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. బుధవారం(అక్టోబర్ 20) పట్టాభిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయగా.. నేడు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

ఇటీవల మీడియా సమావేశంలో టీడీపీ నేత పట్టాభి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనితో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 

ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. దీనికి నిరసనగా టీడీపీ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. అయితే, టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ జనాగ్రహ దీక్షలు నిర్వహించింది.

ఇది కూడా చదవండి: రేవంత్ ను కలిస్తే తప్పేంటి? : బీజేపీ నేత ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement