ఏపీ దేవదాయశాఖ నిధులను మళ్లించారంటూ దాఖలైన్ పటిషన్ విచారణను హై కోర్టు మూసివేసింది. రూ.49 లక్షలను వైఎస్సార్ వాహనమిత్ర కోసం విడుదల చేసేందుకు దేవ ప్రభుత్వం ఈ నెల 15న జారీచేసిన జీఓ 334ను సవాలు చేస్తూ తిరుపతికి చెందిన జి.భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కోసం దేవదాయ నిధులను ఉపయోగించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు చేసిన కేటా యింపుల నుంచి బ్రాహ్మణ వాహన మిత్రలకే నిధులు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల నుంచి రూ.49 లక్షలను వైఎస్సార్ వాహనమిత్ర కోసం విడుదల చేసేందుకు దేవదా య శాఖ స్పెషల్ కమిషనర్ పరిపాలన అనుమతి నిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ పథకానికి దేవదాయ నిధులు మళ్లించలేదంటూ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌తో సంతృప్తి చెందానని.. వ్యాజ్యంపై విచారణను ముగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్‌పకుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.
ఇది కూడా చదవండి: సూర్యాపేట జిల్లాలో ఆకట్టుకుంటున్న రెడీమేడ్ ఇల్లు