ఆనందయ్య మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ నెల 27న విచారణ చేపట్టన్నట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ప్రభుత్వం మందు పంపిణీకి ఖర్చులు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్న పిటిషనర్లు.. శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాలని కోరారు. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణీ అపారని పోలీసులు చెబుతున్నారని లోకాయుక్తకి ఆ అధికారం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఏ ఆదేశాలు లేకుండా ఆపటం సరికాదని, ఆర్డర్ ఇవ్వకుండా ఆయన్ని ఆపటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు.
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆనందయ్య నాటు మందుపై పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య తన మందును తయారు చేశారు. మందులో వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే పరిశీలించారు. ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలను వాడటం లేదని గుర్తించారు. మరోవైపు ఐసీఎంఆర్ బృందం కూడా ఈ మందును పరిశీలిస్తోంది. అయితే ఐసీఎంఆర్ ఏం నివేదిక ఇస్తుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.