Wednesday, November 20, 2024

ఏపీ ప్రభుత్వానికి షాక్.. ఆ జీవో సస్పెండ్‌ చేసిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కొట్టేసింది. టీటీటీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని పిటిషినర్ల తరుపున న్యాయవాది వాదించారు. టీటీడీ నిర్ణయం సామాన్య భక్తులపై ప్రభావం చూపుతుందని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అలాగే దీనిపై టీటీడీ, వైసీపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా, ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌లను నియమిస్తూ మరో ఉత్వర్వును జారీ చేసింది. వీరిద్దరికీ బోర్డులో ఓటింగ్‌ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్‌ ఉంటుందని అందులో పేర్కొంది. అంతేకాదు గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. తితిదే బోర్డులో మాత్రం గతంలోలాగే మొత్తం 25 మందినే కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ఇదివరకే నియమించినందున మిగిలిన 24 మంది సభ్యుల జాబితాను గత వారం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్ ఛార్జీలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement