Saturday, November 16, 2024

AP | తుగ్గలిలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన రహదారి

తుగ్గలి, (ప్రభ న్యూస్) : మండల కేంద్రమైన తుగ్గలిలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో తుగ్గలి చెరువులోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో… చెరువు కట్టకు సమీపంలోని తుగ్గలి ఎద్దులదొడ్డి రోడ్డు వర్షపు నీటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ రోడ్డు నుంచి వెళ్లే ప్రయాణికులు 20 కిలోమీటర్ల దూరం నుంచి పత్తికొండ మీదుగా ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. రెండేళ్ల నుంచి ఈరోజే ఈరోజే ఇంత‌టి భారీ వర్షం కురిసిందని ప్రజలు అంటున్నారు. తుగ్గలి చెరువుకు దాదాపు సగభాగం వరద నీరు చేరింది.

దీంతో ఈ ఏడాది చెరువు కింద మాగాణి పండించవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మండల ఇంజినీర్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. వర్షం తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతామని ఆమె తెలిపారు. అలాగే వరద పరిస్థితిని మైనర్ ఇరిగేషన్ ఏఈ చంద్రశేఖర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement