నందికొట్కూరు.అక్టోబర్ 17:(ఆంధ్రప్రభ) (నంద్యాల)తుఫాన్ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలోబుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం. దీంతో గురువారం ఉదయం హాజీ నగర్,మారుతి నగర్ కాలనీలు నీట మునిగాయి.
ఇక ప్రధాన రహదారులపై మోకాలు లోతులో నీరు ప్రవహించింది. వాహనదారులు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. హాజీ నగర్, మారుతి నగర్ కాలనీలతో పాటు ఏకంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది..