కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక ఇంకా రావాల్సి ఉందని, నాటు మందుకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. హైదరాబాద్ ల్యాబ్ లో నిర్వహించిన పరిశోధనలో కృష్ణపట్నం మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని నిర్ధారించారన్నారు. ఆ మందును ఆయుర్వేదిక్ మందు అని నిర్ధారణ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందన్నారు. కృష్ణపట్నం మందు తయారీ విధానాన్ని ఆయూష్ కమిషనర్ స్వయంగా పరిశీలించారన్నారు. ఇప్పటికే ఆ మందు వాడిన వారిపై ఎటువంటి ప్రభావం చూపించిందనే విషయంపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement