Friday, December 13, 2024

President Award | ఏపీకి అవార్డుల పంట‌.. రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీదుగా స్వీక‌ర‌ణ !

ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీ రాష్ట్రపతి అవార్డును దక్కించుకుంది. ముప్పాళ్ల గ్రామం జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం, సోషల్ సెక్యూరిటీ విభాగాల్లో ఉత్తమ పంచాయతీగా ఎంపికై ఈ గౌరవాన్ని పొందింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ముప్పాళ్ల గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, ఉపసర్పంచ్ నల్ల రవి, పంచాయతీ కార్యదర్శి సాయిరాం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

అలాగే అనకాపల్లి జిల్లాలోని నాయంపూడి, తగరంపూడి పంచాయతీలు కూడా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను అందుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement