Tuesday, November 19, 2024

AP – టిడిపి ఎమ్మెల్యే కోనేటిపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు…. పార్టీ నుంచి సస్పెండ్

త‌న‌పై లైంగిక‌దాడి చేశాడ‌న్న బాధితురాలు
తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ వేదిక‌
తన, ప‌రం అనే తేడా ఉండందు
అందంగా ఉండే అమ్మాయి క‌నిపిస్తే వ‌ద‌ల‌డు
రూమ్ నెంబ‌ర్ 109కి రావాలని బెదిరిస్తున్నాడు
100 సార్లు ఫోన్ చేశాడు.. కాల్ రికార్డ్స్ ఉన్నాయి
లైంగిక దాడి వీడియోలు కూడా ఉన్నాయి
..ఆ వీడియోల‌న్నీ మీడియాకు అందించిన మ‌హిళ‌
ఏపీలో సంచలనం.. టీడీపీలో కలకలం
అదంతా ఉత్త‌దే.. ఆరోప‌ణ‌ల‌పై రియాక్టైన ఎమ్మెల్యే
మార్పింగ్ వీడియోల‌తో త‌ప్పుడు ప్ర‌చారం
కొట్టిపారేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ మీడియా స‌మ‌క్షంలో వివ‌రాలు వెల్ల‌డించింది. ఈ విష‌యం ఏపీ, తెలంగాణ‌లో తీవ్ర సంచలనం రేపింది. లైంగిక దాడికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా బాధితురాలు మీడియాకు అందజేసింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించింది..

- Advertisement -

చంపేస్తాన‌ని బెదిరించారు..

తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కోనేటి ఆదిమూలం తనను బెదిరించ‌డాని బాధితురాలు చెప్పింది. తాను కూడా తెలుగు మహిళా కార్యకర్తనేనని తెలిపింది. ఒకే పార్టీకి చెందినందున పలు కార్యక్రమాల్లో ఆదిమూలంను కలిసినట్టు వెల్లడించింది. అలా పరిచయమైన తరువాత తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడని, మొబైల్ కు పదేపదే కాల్స్ చేసేవాడని చెప్పింది. తిరుపతిలోని భీమాస్ హోటల్‌లోని రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడని తెలిపింది. అక్కడ తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది. ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని.. అలా తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నానని తెలిపింది. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితురాలు వెల్లడించింది.

రోజుకో అమ్మాయి కావాలి..

ఇంత‌టి దారుణానికి పాల్ప‌డ్డ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో ఉండటానికి అర్హుడు కాడని బాధిత మ‌హిళ తెలిపింది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశానని వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలున్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడని పేర్కొంది. రాత్రులు మెసేజ్‌లు చేసి వేధించేవాడని తెలిపింది. రోజుకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడని పేర్కొంది. అందమైన అమ్మాయి కనబడితే చాలు తనతో ఉండాల్సిందేనని.. ఆదిమూలం ఎంతో మందిని టార్చర్ చేశాడని వెల్లడించింది. తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ ఎమ్మెల్యే నీచ చర్యలకు అడ్డా అని తెలిపింది. ఇలాంటి వాళ్ల‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఆయనను ఎలాంటి కార్యక్రమాలకు పిలవొద్దని పేర్కొంది. ఆదిమూలం తమ ఇంటికి వచ్చాడని ఎవ్వరూ సంబరపడి పోవద్దని.. అలా వస్తే మీ భార్య, పిల్లలపై కన్నేస్తాడని పేర్కొంది. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడని.. అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలని బాధితురాలు వేడుకొంది.

అది మార్ఫింగ్ వీడియో కావొచ్చు : ఎమ్మెల్యే ఆదిమూలం

ఓ మ‌హిళ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ఆదిమూలం రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. ఆ వీడియో ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలన్నారు.

ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెండ్…

తెలుగు మహిళపై లైంగిక వేధింపుల వివాదంలో ఇరుక్కున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. హైదరాబాద్‌లో మీడియా సత్యవేడు ఎమ్మెల్యేతో ఏకాంతం దృశ్యాలను ఓ మహిళ బయట పెట్టారు. తనను వేధించి లోబర్చుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా పరిగణించిన హైకమాండ్.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంంది. ఈ మేరకు ఏపీ టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement