రాయచోటి – అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యాపారులపై గన్ ఫైరింగ్ చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం ఆపరేషన్ చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే… అన్నమయ్య జిల్లాలో ఇవాళ(ఆదివారం) కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై కాల్పులకు దుండగులు దిగారు. విచక్షణ రహితంగా దాడులకు పాల్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.పాత సామాగ్రి వ్యాపారులపై దుండగులు తుపాకీతో గన్ ఫైరింగ్ చేశారు.
కాల్పులు జరగడంతో అన్నమయ్య జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుండగుల కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమచారం అందండతో సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వారి కదలికల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరికి ఎవరితోనైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు. కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నారు.